స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం వద్ద ఆందోళన | - | Sakshi
Sakshi News home page

స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం వద్ద ఆందోళన

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మలిదశ పోరాటంలో భాగంగా గురువారం నల్లచెరువురోడ్డులోని మహావీర్‌ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న టెన్త్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్‌ కె.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు విడతల డీఏను మంజూరు చేయాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌ బాబు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీటీఎఫ్‌ (257) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బసవలింగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయడంతోపాటు ఉపాధ్యాయుల అంతర మున్సిపాలిటీల బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ విధులకు హాజరైన ఉపాధ్యాయులందరూ సాయంత్రం 4.00 గంటల నుంచి గంటసేపు సమస్యలపై నిరసన గళం విన్పించి న్యాయ పోరాటాన్ని విజయవంతం చేసినట్లు నరసింహారావు తెలిపారు. ధర్నాలో జిల్లా ఫ్యాప్టో కో–చైర్మన్‌ ఫైజుల్లా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ యు.రాజశేఖర్‌రావు, మహమ్మద్‌ ఖాలీద్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్‌ బాజీ, దాసు, జిల్లా నాయకులు మేకల సుబ్బారావు, ఎంవీ ప్రసాద్‌ జె.విజయానంద్‌, బి.ప్రసాద్‌, వై.మనోజ్‌ కుమార్‌, బి.గోపీకృష్ణ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement