ఆగ్రహ జ్వాల | - | Sakshi
Sakshi News home page

ఆగ్రహ జ్వాల

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

ఆగ్రహ జ్వాల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతల నిరసన గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ తనిఖీలు గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేయాలి నిత్యాన్నదానానికి విరాళం

న్యూస్‌రీల్‌

నీతిమాలిన వ్యాఖ్యలు

క్షమాపణలు చెప్పాల్సిందే

ఆంధ్రజ్యోతిని మూసివేయిస్తాం

జర్నలిజం ముసుగులో అక్రమాలు

సమర్థించుకోవడం దారుణం

ప్రభుత్వం శాశ్వత కాదు...

కించపర్చేందుకు నోరెలా వచ్చింది?

రాధాకృష్ణ బతుకు ప్రజలకు తెలుసు

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

నిమ్మకాయల ధరలు

పులిచింతల సమాచారం

గుంటూరు
అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతల నిరసన

7

పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బుధవారం సాయంత్రం గుంటూరు ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని లాలాపేట పోలీసుస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో స్టేషన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని నేరాల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు. డ్రగ్స్‌, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. గత ఆరు నెలల కాలంలో 300 మందిని గంజాయి, ఇతర డ్రగ్స్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, డీఎస్పీ బెల్లం శ్రీనివాస్‌, లాలాపేట సీఐ శివప్రసాద్‌, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: గ్యాస్‌ ఏజన్సీలు వినియోగదారుల ఇంటికి వెళ్లి సిలిండర్‌ డెలివరీ చేయాలని రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ డైరెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ ఆదేశించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బాలాజీ గ్యాస్‌ కంపెనీని ఆమె బుధవారం తనిఖీ చేశారు. కంపెనీ వద్దకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీవాస్‌ నుపూర్‌ మాట్లాడుతూ ముందుగా గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారిణి కోమలి పద్మ, సీఎస్‌ డీటీ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్‌కుమార్‌, పవిత్ర కుటుంబం తమ కుమారుడు జి.దేవాశిష్‌ పేరిట రూ.1,01,116.. పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్‌ చిన్నారి జి.ధీరన్‌ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ పర్యవేక్షకులు వారికి అమ్మవారి చిత్ర పటం, శేషవస్త్రాలను బహూకరించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: మహిళలకు కించపర్చేలా వ్యవహరించిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చెత్త పలుకుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ దిగజారిన రాతలపై నిరసనగా బుధవారం గుంటూరు జిల్లా వైఎస్సార్‌ సీపీ నేతలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు బ్రాడీపేట 4వ లైనులోని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బ్రాడీపేట 4వ లైనులోని కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన పార్టీ శ్రేణులను తొలుత పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. 4వ లైనులోకి వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకున్నారు. దీంతోపాటు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడే ఉన్నారు. నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమను ఈ విధంగా అడ్డుకోవడం తగదని పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలు బారికేడ్లను తోసుకుని, రఘు మాన్షన్‌ ఎదుట రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలు మినహా, మిగిలిన నాయకులు, కార్యకర్తలను వెళ్లనీయకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గ సమన్వయకర్తల వెంట వచ్చిన పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్‌ చేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్‌ను అడ్డుకున్న అంబటి మురళీకృష్ణ కుడి చేతికి గాయమైంది.

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేయించిన సీఐ బి.శ్రీనివాసరావుపై అంబటి మురళీకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం శాశ్వతం కాదని, యూనిఫాం విప్పదీసి జైలుకు పంపుతామని ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఈ విధంగా ఓ ప్రైవేటు టీవీ చానల్‌, పత్రికకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన తమను పత్రికా కార్యాలయం ఎదుట కాదు కదా, కనీసం రోడ్డులోకి వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపేందుకు హక్కు లేదా? అని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పని పక్షంలో భవిష్యత్తులో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌, పత్రికను మూసి వేయిస్తామని హెచ్చరించారు.

మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ తన జీవితంలో ఎదిగేందుకు చేసిన పనులను వైఎస్సార్‌సీపీ నేతలకు ఆపాదించి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పత్రిక, చానల్‌లో ఇష్టారాజ్యంగా మాట్లాడితే గొప్ప వ్యక్తి కాబోవని రాధాకృష్ణను ఉద్దేశించి పేర్కొన్నారు. రాధాకృష్ణ బతుకేంటో ప్రజలకు తెలుసని, అత్యంత నీచమైన జీవితం రాధాకృష్ణది అని ఆరోపించారు. అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న చంద్రబాబును భుజానికెత్తుకుని మోస్తున్న రాధాకృష్ణ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడేందుకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. రాధాకృష్ణ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా అని అన్నారు. ఏబీఎన్‌ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే ఇన్ని అడ్డంకులా అని మండిపడ్డారు. ప్రజలకు, మహిళలకు రక్షణ ఇవ్వలేని పోలీసులు శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు రాధాకృష్ణ దిష్టిబొమ్మ, ఆంధ్రజ్యోతి దిన పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.

నగర అధ్యక్షురాలు నూరిఫాతిమాను అడ్డుకుంటున్న పోలీసులు

అంబటి మురళీకృష్ణపై దాడి

చేస్తున్న పోలీసులు

వేమూరు రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం

చేస్తున్న పార్టీ శ్రేణులు

ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బారికేడ్లు

అడ్డుపెట్టిన పోలీసులు

ఫ్లకార్డులతో మహిళల నిరసన

తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. ఏబీఎన్‌ చానల్లో చేసిన అసభ్యకరమైన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. నిరసన ప్రదర్శనలో మిర్చియార్డు మాజీ చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్‌ సీపీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్‌, ఎస్సీ జిల్లా అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు బాషా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్‌, బందెల ఉదయ్‌ శంకర్‌, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్‌, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పేరుపోగు బాబు, పెనుమాల అరుణ్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జులు అంకాల రాజు, జి.ప్రభు, నగర బీసీ సెల్‌ అధ్యక్షుడు పల్లపు మహేష్‌, నాయకులు బెంజిమెన్‌, దేవదాసు, అశోక్‌, కూచిపూడి సాయికిరణ్‌, చింతపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ నేతల ఇళ్లలోని మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్పిందేనని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ శ్రేణుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్నారు. మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ మాట్లాడిన తప్పుడు మాటలపై నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు? జనవరి 31న తాను చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గూండాలు తన ఇల్లు, కార్యాయాలపై ఏడు గంటలకు పైగా దాడికి పాల్పడితే ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు ఓ ప్రైవేటు పత్రికా కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వస్తే ఈ స్థాయిలో నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు? దాదాపు 70 ఏళ్ల వయసు వచ్చిన రాధాకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి ఉంటే తాము నిరసన ప్రదర్శన నిర్వహించే అవసరమే ఉండదన్నారు.

మహిళలకు ఏబీఎన్‌ రాధాకృష్ణ

క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

నిరసన తెలిపేందుకు వచ్చిన

వారిని అడ్డుకున్న పోలీసులు

వైసీపీ కార్యకర్తలపై అత్యుత్సాహంతో

పోలీసుల లాఠీచార్జ్‌

ఎన్టీఆర్‌ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మహిళలకు కించపర్చే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని మూసివేయిస్తామని స్పష్టం చేశారు. దమ్మున్న చానల్‌ అని చెప్పుకునే ఆ చానల్‌ ప్రతినిధులు ఇక్కడ ఇంత పెద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే కవరేజ్‌ చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5 ఎక్కడని అన్నారు. నిష్పక్షపాతంగా ప్రసారం చేయలేని చానళ్లు, పత్రికలు మూసుకోవాలన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడేం చెబుతారని నిలదీశారు. హీరోయిజం ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు న్యాయం చేయలేని డిప్యూటీ సీఎం పదవి ఎందుకని నిలదీశారు. పనికిమాలిన రాధాకృష్ణను పక్కనపెట్టుకుంటే చంద్రబాబు, లోకేష్‌ మునిగిపోతారన్నారు.

గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్‌ మాట్లాడుతూ మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ వాటిని సమర్థించుకోవడాన్ని చూస్తే సీ్త్రలపై ఎంతటి గౌరవం ఉందో అర్ధమవుతోందన్నారు. చిలుక పలుకులు, సూక్తులు ,చెబుతున్న రాధాకృష్ణ నీతిమాలిన వ్యాఖ్యలను ఖండిచాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లకు లేదా అని ప్రశ్నించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పకుంటే నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శాంతియుత నిరసన చేస్తున్న పార్టీ నాయకులను సీఐ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, డీఎస్పీతో మాట్లాడుతున్న సమయంలో కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యలు చేసిన సీఐ తనకు తాను డీఎస్పీ కంటే పెద్ద అధికారిగా భావిస్తున్నారా అని నిలదీశారు.

ఫిరంగిపురం: ఫిరంగిపురంలోని విజయదుర్గ ఆలయ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి నూతన వస్త్రాలతో అలంకరించారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.12,000, మోడల్‌ ధర రూ.9000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.3706 టీఎంసీలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement