నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీసు పెరేడ్‌గ్రౌండ్, జిల్లా పోలీసు సమావేశ మందిరంలో 30 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఫ్రీ ప్రమోషనల్ పరీక్ష నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఏఎస్సైలు పరీక్షకు హాజరయ్యారు. అనంతరం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వివిధ అంశాలపై వారితో మాట్లాడి ప్రతిభను అంచనా వేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్‌బాబు, ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, గుంటూరు ఏఎస్పీ రమణమూర్తి, గుంటూరు ఏఆర్ డీఎస్పీ సంకూరయ్య, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు.


