ఐదేళ్ల కిందట 113 తాళ్లూరుకి చెందిన ఓ వ్యక్తి ఫిరంగిపురంలో ఓపెన్ ప్లాట్స్ వెంచర్ వేశారు. చేరొక ప్లాట్‌ను రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలకు కొనుగోలు చేశాం. ఈనెల్లో ప్లాట్ విక్రయించాలని సదరు వెంచర్ నిర్వాహకుడికి తెలియజేశా. నీకు ప్లాట్ ఎక్కడ ఉంది అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. ఇందులో ఉన్న భార్యాభర్తలకి ఇదే విషయమై చెప్పగా, వారి నుంచి సరైన సమాధానం చెప్పలేదు. ఈ ముగ్గురి వల్ల మోసపోయాం. 113 తాళ్లూరుకి చెందిన వ్యక్తితో తమకు ప్రాణహాని ఉంది. తమకు న్యాయం చేయగలరు.
– మద్ది ప్రకాష్‌బాబు, వాసవినగర్, పోలిశెట్టి వెంకటరామారావు, ముప్పిరిశెట్టి వారి వీధి, కొత్తపేట.


