‘తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి?’ | YSRCP Leader Vellampalli Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి?’

Apr 9 2026 4:06 PM | Updated on Apr 9 2026 5:54 PM

YSRCP Leader Vellampalli Slams Chandrababu Naidu

తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూ ఆర్‌ కోడ్‌ పెట్టింది వైఎస్‌ జగన్‌ అని, ల్యాండ్‌ రీ సర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.  ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ ఎన్నికలు ముందు ఈ సర్వేలు వద్దన్నారు. నేనొస్తే రద్దు చేస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వే మొదలుపెట్టి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. 

మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టింది.  అసలు తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. రెండు లక్షల కోట్ల అప్పులభారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. 

మూడు ప్రాంతాలు కలిపితే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుంది. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అచ్చెన్నాయుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో సంతకాల సేకరణ చేశారు అంటున్నారు. సంతకాల సేకరణతో సంబంధం లేదని అనేక సందర్భాల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? అంటూ నిలదీశారు. 

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement