వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం: జీవన్‌రెడ్డి | Ex Minister Jeevan Reddy Shocking Comments On Congress | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం: జీవన్‌రెడ్డి

Apr 9 2026 1:37 PM | Updated on Apr 9 2026 6:08 PM

Ex Minister Jeevan Reddy Shocking Comments On Congress

సాక్షి, జగిత్యాల జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే పార్టీతోనే జత కట్టాలని భావించానని.. అందుకే, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్ రాబోతున్నారు. ఆయన వచ్చాక ఎప్పుడు జాయిన్ కావడమనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

కేసీఆర్ పాలన కంటే కాంగ్రెస్ బెటర్ అని భావించి అధికారం ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ కంటే కేసీఆర్ పాలన వందరెట్లు బెటర్ అనిపిస్తోంది. మొక్కజొన్న కొనుగోళ్లు లేవు, రైతుబంధు సమయానికి పడదు, ఆరు గ్యారంటీల అమలూ సరిగా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. నేను తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలని కోరానేగానీ.. కాళేశ్వరంపై విమర్శలు చేయలేదు. ప్రజాభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నా ఫైట్ కొనసాగుతుంది’’ అంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement