ఆర్‌డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ

Mar 26 2026 7:50 AM | Updated on Mar 26 2026 7:50 AM

ఆర్‌డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ ఏఎన్‌యూలో ఏప్రిల్‌ 1న క్యాంపస్‌ డ్రైవ్‌ ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 1న ప్రముఖ ఔషధ సంస్థ లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు విభాగాధిపతి ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ డ్రైవ్‌ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లారస్‌ ల్యాబ్స్‌ భారతీయ బహుళజాతి ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ సంస్థగా పేరుపొందింది. విద్యార్థులకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ క్యాంపస్‌ నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎంఎస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనలిటికల్‌ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఈ డ్రైవ్‌ ద్వారా ఎంపికై న అభ్యర్థులకు సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు బుధవారం ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌ వివరించారు. 28 నుంచి డాక్టర్‌ మాగంటి మురళీమోహన్‌ ద్వితీయ నాటకోత్సవాలు

నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్‌డీఓ)గా నియమితులైన బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా ఆయన నందిగామ నుంచి నరసరావుపేటకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన కె.మధులతను రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నరసరావుపేట డివిజన్‌ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని నూతన ఆర్‌డీఓ వెల్లడించారు.

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : స్థానిక బృందావన్‌గార్డెన్‌న్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ మాగంటి మురళీమోహన్‌ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ తొమ్మిదవ వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు కాట్రగడ్డ రామకృష్ణప్రసాద్‌, బొప్పన నరసింహారావు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ఈనెల 28, 29, 30 తేదిల్లో నాటకోత్సవాలు కొనసాగుతాయని అన్నారు. 28న ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్మన్‌ తేజస్వినికి డాక్టర్‌ మురళీమోహన్‌ రంగస్థల పురస్కారం, మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శిస్తారని తెలిపారు. 29న నువ్వో సగం, నేనో సగం నాటిక, 30న ఆర్యచాణక్య చారిత్రాత్మిక నాటకం ప్రదర్శించనున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement