గుంటూరు: కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన జంట హత్యల కేసుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు గురజాల కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అక్రమ కేసులో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి 106 రోజుల పాటు జైల్లో ఉన్నారు. రేపు గుంటూరు జైలు నుంచి వెంకటరామిరెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదే కేసుకు సంబంధించి గత వారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నెల 18వ తేదీన గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 99 రోజుల పాటు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతవారం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో మాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు.
ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్త్‌లో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాము, ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు’ అని హెచ్చరించారు.


