జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన భవనాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన భవనాలు

Mar 27 2026 9:13 AM | Updated on Mar 27 2026 9:13 AM

జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన భవనాలు

నగరంపాలెం: జిల్లా పోలీస్‌ శాఖకు పీజీఆర్‌ఎస్‌, మినీ హాల్‌ నూతన భవనాలను అప్పగించడం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, చాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో వీఐటీ–ఏపీ విద్యా సంస్థల సహకారంతో నిర్మించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌), మినీ హాల్‌ నూతన భవనాల శిలఫలకాలను వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, చాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌లు ఆవిష్కరించారు. వేద మంత్రాల నడుమ ఈ భవనాలను రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ అరుల్‌మౌళివర్మన్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌చంద్ర, జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్‌), డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్‌బీ), అలహరి శ్రీనివాస్‌, సంకురయ్య (ఏఆర్‌), ఏఆర్‌ ఆర్‌ఐలు సురేష్‌బాబు, రామకృష్ణారెడ్డి, శివరామకృష్ణ , శ్రీహరిరెడ్డి, రామకృష్ణారెడి, పలువురు సీఐలు, వీఐటీ–ఏపీ యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా హాజరు కాలేదు. మార్కాపురంలో జరిగిన బస్‌ ప్రమాదం దృష్ట్యా అత్యవసరంగా అక్కడకెళ్లారని కార్యాలయపు వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement