నగరంపాలెం(గుంటూరు వెస్ట్): జిల్లాలోని లాడ్జిలు, హోటళ్లు, డార్మిటరీలలో శనివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. రాత్రి వేళ బస చేసిన వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. అనుమానితుల వివరాలు సేకరించారు. అనంతరం ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా ధృవీకరణ చేపట్టారు. ప్రతి ఒక్కరి నుంచి ఆధార్ లేదా గుర్తింపు పత్రం తీసుకోవాలని నిర్వాహాకులకు సూచించారు. రిజిస్టర్ పుస్తకం విధిగా పాటించాలని అన్నారు. సీసీ టీవీ కెమెరాలను ప్రవేశ ద్వారాలు, కారిడార్లు, పరిసరాల్లో బిగించాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులపై సమీప పోలీస్‌స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. డార్మిటరిస్, హోటళ్లు, లాడ్జిలలో చట్టవ్యతిరేక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 816 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ బ్యాంక్ కెనాల్‌కు 60 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 110, పశ్చిమ కాలువకు 70, కొమ్మూరు కాలువకు 200 క్యూసెక్కుల విడుదల చేశారు


