విశ్వశాంతి స్థాపనకు కవులు పునరంకితం కావాలి ● విశ్వసాహితీ కళావేదిక, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రాచీన కవులను ఆదర్శంగా చేసుకుని, నేటి తరం కవులు ముందడుగు వేయాలని సూచించారు.
● రంగిశెట్టి రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, పీటీ అవధాని, కొప్పరాజు విజయసారథిబాబు, చందు సూర్య, సూరికుచ్చి బదరీనాథ్, ఈపూరు ప్రేమ్‌కుమార్, అంతర్జాతీయ శిల్పి, కవి అక్కల శ్రీరామ్, ఎంవీ రఘునాథరావు, లక్కరాజు లక్ష్మణరావు, తన్నీరు శివశంకర్, వినుకొండ శ్రీరామ్మూర్తి, సిద్దాబత్తుని సుబ్రహ్మణ్యం, నూతలపాటి నాగేశ్వరరావు, శనగపల్లి ఉమామహేశ్వరరావు, యిడపలపాటి వెంకట సుబ్బారావు, షేక్ అస్మాతున్నీసా, ఆళ్ల సుజాత, రెండు సంస్థల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
● కవితా పఠనం చేసిన కవులను యిడపలపాటి వెంకట సుబ్బారావు, అక్కల శ్రీరామ్, కొలసానివెంకట భూపతి నాయుడు, డాక్టర్ సీహెచ్ శేషిరెడ్డి, యండ్రపాటి చింపయ్యలు సత్కరించారు.
ప్రపంచ కవితా దినోత్సవ సభలో రంగిశెట్టి రమేష్
తెనాలి: ప్రపంచ కవితా దినోత్సవం రోజైన శనివారం సాయంత్రం తెనాలి నాజరుపేటలోని కమలశ్రీ సాహితీ నిలయంలో శ్రీకృష్ణ దేవరాయ కళావేదిక, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్త నిర్వహణలో ‘విశ్వశాంతి ఆవశ్యకత–కవుల పాత్ర’ అంశంపై కవిసమ్మేళనం నిర్వహించారు. తొలుత ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. సభకు శ్రీకృష్ణదేవరాయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ సాహితీ కళావేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య విశ్వశాంతి స్థాపనకు కవులందరు మరొక్కసారి పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యుద్ధం అనర్థాలపై సమాజాన్ని చైతన్యపరచి యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలుగెత్తి చాటాలన్నారు.