రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు బలవన్మరణం

Mar 22 2026 1:59 AM | Updated on Mar 22 2026 1:59 AM

రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు బలవన్మరణం

తాడేపల్లి రూరల్‌: భార్య ప్రవర్తనలో మార్పు రావడం, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు తాడేపల్లి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ పరిధిలోని రైల్వే పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి కొత్తూరుకు చెందిన సాయికుమార్‌ (26) ఇదే ప్రాంతంలో నివాసముండే అఖిలాండేశ్వరిని 2019లో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం వేరే వారితో ఫోన్‌లో మాట్లాడడం, సన్నిహితంగా ఉండడం గమనించిన భార్యను పలుమార్లు సాయికుమార్‌ హెచ్చరించినా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఉదయం సమయంలో కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ పరిధిలోని బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద రైల్వేట్రాక్‌పై తలపెట్టాడు. అదే సమయంలో ట్రైన్‌ రావడంతో తలతెగిపోయి సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి తెనాలి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు.

భార్య ప్రవర్తనలో మార్పు రావడంతోనే

అంటున్న మృతుడి బంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement