రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

Mar 22 2026 1:59 AM | Updated on Mar 22 2026 1:59 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు చిలకలూరిపేటటౌన్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి తన స్పొర్ట్స్‌ బైక్‌పై ఒంగోలులోని అత్తగారింటికి బయలుదేరారు. మార్గమధ్యలో లింగుంట్ల బ్రిడ్జి వద్దకు రాగానే, ముందు వెళ్తున్న కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. బైక్‌ నడుపుతున్న విజయభాస్కర్‌ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు చిలకలూరిపేట 108 సిబ్బంది శోభన్‌ బాబు, పైలట్‌ పవన్‌ కళ్యాణ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. ప్రస్తుతం బాధితుడు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఎల్‌పీజీ సిలిండర్లు సీజ్‌

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : వాణిజ్య అవసరాలకు అక్రమంగా గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యానగర్‌లో వణుకూరి పవన్‌కుమార్‌ కార్ఖానాలో నాలుగు ఎల్‌పీజీ సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు సీజ్‌ చేసిన సిలిండర్లను స్థానిక వీఆర్‌ఓకి అప్పగించారు. ఈ మేరకు అతనిపై 6–ఎ కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement