అర్జీలు సత్వరం పరిష్కరించండి
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు ఆలకించారు. సంబంధిత ఫిర్యాదులపై సబ్ డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల అధికారులతో మొబైల్‌ఫోన్లల్లో మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చట్ట పరిధిలోనే బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు అరవింద్ (గుంటూరు పశ్చిమ), అబ్ధుల్‌అజీజ్ (గుంటూరు తూర్పు) బానోదయ (దక్షిణ) ఫిర్యాదులు స్వీకరించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


