నెహ్రూనగర్: మరణాన్ని జయించి సమాధి నుంచి తిరిగి లేచిన యేసు క్రీస్తు పునరుతార్ధన( ఈస్టర్ ) పండుగను పురస్కరించుకొని గుంటూరు నగరంలో శనివారం ఆల్ డినామినేషన్ చర్చి యూనియన్ ఆధ్వర్యంలో వెస్ట్ పారిస్ చర్చి నుంచి రన్ ఫర్ జీసస్ సమైక్య శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిలు పాల్గొన్నారు. కార్యక్రమంలో గుంటూరు మేత్రాసనం, ఆర్‌సీఎం ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్, ఎమినేట్ పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్ పరిశుద్ధరావు, జీపీఎస్ ప్రెసిడెంట్ మోజెస్ సుగుణాకర్, పాస్టర్ బాబు ఆశీర్వాదం , పాస్టర్ జాన్సన్ రాజ్, పాస్టర్ గాబ్రియేలు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ రవివర్మ, పాస్టర్ విద్యాసాగర్, పాల్ మనోహర్, నెల్సన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.


