● వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు అంబటి రాంబాబు
● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పూజలు
మంగళగిరిలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు,
తెనాలిలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
తాడికొండలో పూజలు అనంతరం ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమంలో వనమా బాల వజ్రబాబు తదితరులు
నెహ్రూనగర్: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు ఆ పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు. ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు తూర్పు నియజకవర్గం పరిధిలోని మంగళదాస్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి పట్టణం ఘాట్‌రోడ్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో చేబ్రోలులోని చతుర్ముఖ బ్రహ్మేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నల్లపాడు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మున్నంగి కృష్ణానది ఒడ్డున ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు) ఆధ్వర్యంలో తాడికొండలోని కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


