వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి | Babu Jagjivan Ram Jayanti 2026 At Ysrcp Central Office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

Apr 5 2026 12:12 PM | Updated on Apr 5 2026 1:39 PM

Babu Jagjivan Ram Jayanti 2026 At Ysrcp Central Office

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

‘‘కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement