కోటి గళాల నిరసన సంతకం
కోటి గళాల నిరసన సంతకం
పట్నంబజారు: వైద్య కళాశాలలను ప్రయివేటుపరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి లభిస్తున్న మద్దతే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల సంతకాలు వరకు పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన జిల్లాలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, తెనాలి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీల నడుమ ఇలా సేకరించిన సంతకాల ప్రతులను తీసుకురానున్నారు. అనంతరం ఈ నెల 15వ తేదీన గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరగనుంది. ఆయన విగ్రహనికి నివాళులు అర్పించిన అనంతరం పూర్తిస్థాయి సంతకాల ప్రతులను కేంద్ర పార్టీ కార్యాలయంలో అందజేయనున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 26 డివిజన్‌లలో సంతకాల సేకరణ కార్యక్రమాలను పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు చేపట్టారు. అంబటి స్వయంగా పర్యవేక్షించారు. ఆరు డివిజన్‌లలో స్వయంగా పాల్గొని సంతకాల సేకరణ చేశారు. నియోకవర్గంలో మొత్తం 44,500 సంతకాలు పూర్తి అయ్యాయి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23 డివిజన్‌లలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 1 నుం 15వ డివిజన్ వరకు, 17, 50, 51, 53, 54, 55. 56, 57 డివిజన్‌లలో సంతకాల సేకరణ జరిగింది. నూరిఫాతిమా 14 డివిజన్‌లలో స్వయంగా పాల్గొని, సంతకాలు సేకరించారు. ఇప్పటివరకు 40 వేల సంతకాలు పూర్తి కాగా, మరిన్ని సంతకాల సేకరణ జరగనుంది.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పొన్నూరు టౌన్, రూరల్, చేబ్రోలు, పెదకాకాని మండలాలలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పొన్నూరు మండలంలో 20 వేలు, పట్టణంలో ఐదు వేలు, చేబ్రోలు మండలంలో 15 వేలు, పెదకాకాని మండలంలో 25 వేల సంతకాలు సేకరించారు. నియోజకవర్గం మొత్తం 65 వేల సంతకాలు పూర్తయ్యాయి. అంబటి మురళీకృష్ణ గ్రామాలకు వెళ్లి ప్రజలకు మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి వేమారెడ్డి ఆధ్వర్యంలో అక్టోబరు 26వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్, దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో అన్ని గ్రామాల్లో ఇంటింటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరిగి కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటికే 70 వేల సంతకాలు సేకరించారు.
తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అక్టోబరు 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా తెనాలి పట్టణం, రూరల్, కొల్లిపర మండలాలలో 59 వేల సంతకాలు సేకరించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఈ మేరకు సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో అక్టోబరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ఇళ్లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి వైద్య కళాశాలల ప్రయివేటీకరణ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ 50 వేల సంతకాలు పూర్తి చేశారు. ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం సాగింది. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు మండలాల్లో కోటి సంతకాల కార్యక్రమం అక్టోబరు 16న ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 65 వేల సంతకాలు సేకరించారు. స్వయంగా వనమా బాలవజ్రబాబు ఆయా మండలాల్లోని ఇళ్లకు వెళ్లి చంద్రబాబు సర్కారు కుట్రల గురించి వివరించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో...
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో...
పొన్నూరు నియోజకవర్గంలో...
మంగళగిరి నియోజకవర్గంలో...
తెనాలి నియోజకవర్గంలో...
ప్రత్తిపాడు నియోజకవర్గంలో...
తాడికొండ నియోజకవర్గంలో...
వైద్య కళాశాలల
ప్రయివేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు
చంద్రబాబు సర్కారు
అడ్డగోలు నిర్ణయంపై నిరసన
ప్రజల నుంచి పెద్ద ఎత్తున
సంతకాల సేకరణకు మద్దతు
పేద, మధ్య తరగతి వర్గాలకు
వైద్యం, వైద్యవిద్య దూరం చేయడంపై
మండిపాటు
పేద, మధ్య తరగతి వారికి వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా చంద్రబాబు సర్కార్ తీసుకున్న దుర్మార్గ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. వైద్య కళాశాలల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంతో గళమెత్తింది. ఇప్పటీకే వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లి వైద్య కళాశాలలు ప్రయివేటీకరణ వలన అనర్థాలను వివరించారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
1/2
కోటి గళాల నిరసన సంతకం
2/2
కోటి గళాల నిరసన సంతకం