మహాశక్తి దేవతగా బగళాముఖి | - | Sakshi
Sakshi News home page

మహాశక్తి దేవతగా బగళాముఖి

Dec 8 2025 7:44 AM | Updated on Dec 8 2025 7:44 AM

మహాశక

మహాశక్తి దేవతగా బగళాముఖి

మహాశక్తి దేవతగా బగళాముఖి వైభవంగా ప్రారంభమైన శ్రీరామకోటి మహోత్సవాలు హైకోర్టుకు వెళ్లే బస్సు సమయం మార్పు సాగర్‌ నీటిమట్టం వివరాలు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి జరిగిన అర్చనలు, విశేష పూజలలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

నగరంపాలెం: స్థానిక ఆర్‌.అగ్రహారం శ్రీరామనామక్షేత్రం ఆవరణలో 99వ శ్రీరామకోటి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ట్రస్టీస్‌ రాగం వెంకటలీలాసుందరి, బెల్లంకొండ మస్తాన్‌రావు ఆధ్వర్యంలో జరగ్గా, సాయంత్రం క్రోసూరి మురళీకృష్ణమాచార్యుల బృందం అంకురారోపణం, అగ్నిస్థాపనం, రుత్విగ్వరణం, అఖండ జ్యోతిస్థాపన, శ్రీరామ పతాకావిష్కరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రామకృష్ణ మిషన్‌ (సీతానగరం) కార్యదర్శి శ్రీమాన్‌ స్వామి వినిశ్చలానంద పతాకావిష్కరణ చేసి, అనుగ్రహభాషణం చేశారు. 99 ఏళ్లుగా శ్రీరామకోటి మహోత్సవాలను నిర్విరామంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వంశపారంపర్యంగా ఆ సీతారాముల అనుగ్రహంతో పలు ప్రాంతాల భక్తులు, దాతల సహకారంతో చేపట్టడం ఒక బృహత్తర యజ్ఞంగా పేర్కొన్నారు. కలియుగంలో తరించేందుకు రామనామ సంకీర్తనే సరైన మార్గమని చెప్పారు. క్షేత్రాన్ని విద్యుత్‌ దీపాలతో అలకరించారు.

పట్నంబజారు: గుంటూరు డిపో 1 నుంచి హైకోర్టుకు వయా తుళ్లూరుకు నిత్యం ఉదయం 8.00గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి బయలుదేరే జనరల్‌ బస్సు టైమ్‌ను 7.45 నిమిషాలకు మార్చినట్లు డిపో 1 అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 15 నిముషాల ముందుగా మార్చినట్లు వివరించారు. సోమవారం నుంచి మారిన బస్సు సమయం మార్పులను ప్రయాణికులు, ఉద్యోగులు గమనించాలని కోరారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 578.00 అడుగులకు చేరింది. ఇది 277.2460 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు 10,000, ఎడమ కాలువకు 8,367, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 20,167 క్యూసెక్కులు కాగా... శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 20,167 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది

నగరంపాలెం: అక్రమ రేషన్‌ వ్యాపారులకు సహకరిస్తున్న పొన్నూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ (పీఎస్‌) కానిస్టేబుళ్లు ఎం.నాగార్జున, వై.మహేష్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమార్కులపై ఉన్న పోలీసుల నిఘాను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. పోలీస్‌ శాఖ ఉద్యోగులకు ఉండాల్సిన నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణను వారు విస్మరించారని ఆయన పేర్కొన్నారు. పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని, శాఖాపరమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

మహాశక్తి దేవతగా  బగళాముఖి 
1
1/2

మహాశక్తి దేవతగా బగళాముఖి

మహాశక్తి దేవతగా  బగళాముఖి 
2
2/2

మహాశక్తి దేవతగా బగళాముఖి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement