ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు
గుంటూరు వెస్ట్ : మెగా డీఎస్సీ–2025లో ఉపాధ్యాయులుగా ఎంపికై న 21 మంది వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్‌ను అక్టోబర్ 2లోపు రిలీవ్ చేయాల్సి ఉండగా సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్) చెన్నయ్య అదే నెల 13వ తేదీన రిలీవ్ చేసి ఇబ్బందులకు గురిచేశారని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్‌లు బుధవారం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్‌అన్సారీయాకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిపై చెన్నయ్యకు వినతిపత్రం అందజేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఎంపికై న 21 మందికి న్యాయం చేయకుండా అక్టోబర్ 13న సాయంత్రం రిలీవ్ చేయడంతో మొత్తం11రోజులు సర్వీస్ నష్టపోయి ప్రతి బదిలీలలో మిగిలిన డీఎస్సీ 25వారి కంటే వెనకబడతారని తెలిపారు. ఆ 21మందిపై కక్షసాధింపు చర్యగా అక్టోబర్ 13న రిలీవ్ చేసి అన్యాయం చేశారన్నారు. ఈ కారణంగా బదిలీలతో పాటు రేషనలైజేషన్‌లో కూడా నష్టపోతారన్నారు. ఇప్పటికై న ఆ 21మంది వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్‌కి న్యాయం జరగకపోతే సోషల్ వెల్ఫేర్ డీడీ కార్యాలయం ఎదుట బాధిత ఉపాధ్యాయులతో కలసి ఏపీటీఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని తెలిపారు.
ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ


