డీఈవోగా సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా షేక్ సలీమ్ బాషా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారిగా పని చేస్తున్నారు. మంగళవారం జరిగిన డీఈవోల బదిలీల్లో భాగంగా సలీమ్ బాషా గుంటూరుకు, సీవీ రేణుక ప్రకాశం జిల్లాకు డీఈవోలుగా బదిలీ అయ్యారు.
10 నుంచి టెట్ నిర్వహణ
ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఏపీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్)కు గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.


