చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై వెల్లువెత్తిన వ్యతిరేకత కోటి సంతకాల ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 75 వేల సంతకాల సేకరణ చంద్రబాబు ప్రభుత్వం తీరు మారకుంటే ఉద్యమిస్తాం ఎమ్మెల్సీ మురుగుడు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి
తాడేపల్లి రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మూడు మండలాల నుంచి సుమారు 75 వేలకుపైగా సంతకాలు సేకరించారు. ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ సంతకాలు సేకరించడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇంకా పదివేలకు పైగా సంతకాలు సేకరించనున్నట్లు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్)లు పేర్కొన్నారు.
పేదలకు అండగా వైఎస్ జగన్
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్న సమయంలో పేదలకు మేలు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయడానికి కుట్రలు పన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, సమన్వయకర్తతోపాటు మంగళగిరి తాడేపల్లి పట్టణ రూరల్ అధ్యక్షులు, దుగ్గిరాల అధ్యక్షులు ఆకురాతి రాజేష్, బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, నాళి వెంకటకృష్ణ, అమరా నాగయ్య, తాడిబోయిన శివ గోపయ్యల ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలపై ప్రజలకు అవగాహన కల్పించి సంతకాల సేకరణ చేపట్టారు. పెనుమాక, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, దుగ్గిరాలలో విద్యార్థులు తమ ఆవేదనను సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డితోపాటు స్థానిక నాయకులకు విన్నవించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తే ప్రజలకు వైద్యం మరింత దూరం అవుతుందని నాయకులు అవగాహన కల్పించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే సేకరించిన 75,800 సంతకాల ప్రతులను పట్టణ, మండల నాయకులు కలిపి మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలకు అందజేశారు. మరో ఐదు రోజుల్లో పదివేల సంతకాలు పూర్తికానున్నట్లు దొంతిరెడ్డి వేమారెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం
చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం


