
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్‌ఎం గ్రేడ్ –2ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవన్ కార్యాలయం ఎదుట శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వి. రాంప్రభాకర్, జి. నాగరాజులు నేతృత్వం వహించారు. దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, జిల్లా నాయకులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ... సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సలీం, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, విద్యుత్ సీఐటీయూ నాయకులు పవన్, రాంబాబు, శివనాగేశ్వరరావు, సురేష్, నాగరాజు, సలీంబాషా, వర్మ, వంశీ, బి. రవికుమార్, వీరారెడ్డి, లెనిన్ బాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.