
డిసెంబర్ 12 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 8వ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి, ఏపీ రెరా మెంబర్ దామచర్ల శ్రీనివాసరావు, ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు, క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్ గుంటూరు చాప్టర్ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రాపర్టీ షోను డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇందులో నాణ్యమైన అపార్ట్‌మెంట్లు, స్థలాల వివరాలతో పాటు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ, ప్రాపర్టీ షో కన్వీనర్ టి.వినోద్‌రెడ్డి, గుంటూరు చాప్టర్ చైర్మన్ ఆరుమళ్ల సతీష్‌రెడ్డి, ప్రెసిడెంట్ మామిడి రాము, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రెజరర్ ఏ.వి. నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.