
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ కార్యాలయంలో డీఆర్వో ఎన్.ఎస్.ఖాజావలి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్నారు. సంఘం చేసే సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.లూర్థురెడ్డి, ట్రెజరర్ పి. నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. సుబ్బారావు, ఎం.ఎస్.నాగేంద్రం, కె.మురళి, సంయుక్త కార్యదర్శులు ఐ. సాయిబాబు, పెద మస్తాన్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి కంటి హాస్పిటల్, కాస్వి డెంటల్ క్లినిక్ వైద్యులు పరీక్షలు చేసి సభ్యులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. సందేహాలను నివృత్తి చేశారు.