
నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలే
గుంటూరు వెస్ట్: మంచినీటి సరఫరాలో అలసత్వం వహించే సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయొద్దని తెలిపారు. ఈ నెల 20వ తేదీన దీపావళి సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకోవడానికి అనువైన ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దుకాణాల ఏర్పాటుకు 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వట్టిచెరుకూరు మండలం కూర్నూతలలో సీసీఐ పత్తి కొనుగోళ్లుకు నోటిఫై చేసిన గాయత్రి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో సన్నద్ధత ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు.
అమరేశ్వరుని హుండీ ఆదాయం
అమరావతి:అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలలోని కానుకలను లెక్కించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వా మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాసరి చంద్రశేఖరరావు సమక్షంలో 12 హుండీలను తెరచి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు నెలల 7 రోజుల కాలానికి దేవాలయంలో ఉన్న హుండీల ఆదాయం మొత్తం రూ. 20,07,999. అన్నదాన మండపంలోని హూండీ ద్వారా రూ.48, 809 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ తెలిపారు.
అచ్చంపేట జెడ్పీ హైస్కూల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
అచ్చంపేట: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు కావలసిన వసతులు, తరగతి గదులను పరిశీలించారు. ఇక్కడ 1950లో స్థలదాత తుమ్మేపల్లి శ్రీరాములు నిర్మించిన పురాతన భవనం శిథిలం కాగా, ఇటీవల పూర్వవిద్యార్థులు సుమారు రూ.20లక్షల వ్యయంతో ఆధునీకరించారు. అందులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని ఆర్జేడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ గదులను ఇంకా ఆధునీకరించవలసి ఉందన్నారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
19న త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదానోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్ : తెలుగు సమాజంలోని గొప్ప సామాజిక విప్లవకారుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. 2025వ సంవత్సరానికి రామస్వామి చౌదరి పురస్కారాలను సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మూకిరి సుధ, వీసీకే పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు కై లా జయసుధ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – జాషువా – పూలే – పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ పాల్గొన్నారు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలే

నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలే

నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలే