
ఏఎన్‌యూలో ప్రపంచ హస్తకళల దినోత్సవం
పెదకాకాని: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో హస్తకళలు కీలకపాత్ర పోషిస్తాయని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పులిచెర్ల దేవకాంత్ అన్నారు. ప్రపంచ హస్తకళల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేవకాంత్ మాట్లాడుతూ హస్తకళలు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటంలో, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయన్నారు. అనంతరం కొండపల్లి, ఏటికొప్పాక, చెన్నపట్నం బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం, కలంకారి, చేనేత వస్త్రాలను విద్యార్థులు ప్రదర్శించారు. అధ్యాపకులు బి.శేఖర్‌బాబు, జాన్‌రత్నబాబు, వి.వీరయ్య, విద్యార్థులు సీహెచ్ హెలీనా, చక్రిత విద్య, రేణుక, బాంధవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.