
109 మంది వీవీఐబీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (వీవీఐబీయూ)కి చెందిన 109 మంది విద్యార్థులు కాగ్నిజెంట్ (డిజిటల్ నర్పూర్) డెల్టా ఎక్స్, ప్లిస్ట్ ల్యాబ్స్, జెన్‌ట్రీ ట్యాబ్స్, టెక్ అవుట్ సొల్యూషన్స్, ఈఫిల్ టెక్ సొల్యూషన్స్, పాలెక్, సెర్పాడ్ వంటి బహుళ జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందారని వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీ యూనివర్సిటీలో ఆగస్టు, సెప్టెంబర్‌లలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 2022–2026 బ్యాచ్ విద్యార్థులు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వార్షిక వేతనంతో నియామకాలు పొందారని తెలిపారు.