
కేఎల్‌యూలో ‘సమ్యక్ 2025’
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో శుక్రవారం జాతీయస్థాయి టెక్నో మేనేజ్‌మెంట్ ఫెస్ట్ ‘సమ్యక్ 2025’ ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి రాష్ట్ర క్రీడల అథారిటీ చైర్మన్ అనిమి రవినాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే జాతీయ స్థాయి వేదికను సృష్టించినందుకు కేఎల్‌యూను ప్రశంసించారు. అనంతరం ఆయన్ను వర్సిటీ వీసీ, ప్రో వీసీలు తదితరులు ఘనంగా సత్కరించారు. వీసీ డాక్టర్ పార్ధసారథి వర్మ మాట్లాడుతూ మొదటి రోజు కార్యక్రమంలో 23 రాష్ట్రాల నుంచి సుమారు 25 వేలం మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ప్రాజెక్ట్ ఎక్స్‌పో, ఏఐ, ఎంఎల్, మొబిలిటీ, హెల్త్ టెక్, ఎంబెడెడ్ సిస్టమ్‌లలో 450కుపైగా ఆవిష్కరణలు ప్రదర్శించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, సమ్యక్ చైర్మన్ డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎ.శ్రీనాథ్, డాక్టర్ మాధవ్, కన్వీనర్లు డాక్టర్ వి.రాజేష్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, సీనియర్ నిర్వాహకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.