
జాతీయ పికిల్ బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): బెంగళూరులో శనివారం నుంచి జరగనున్న జాతీయ ఓపెన్ పికిల్ బాల్ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, విన్సెంట్ ఎంపికయ్యారని జిల్లా సంఘం చైర్మన్ టి.అరుణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీవీవీ హెల్త్ హబ్‌లో వారు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్రీడాకారులను తనతోపాటు జిల్లా సంఘం అధ్యక్షుడు టి.హరికిషన్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.శివకుమార్, హ్యాట్రిక్ స్పోర్ట్స్ అధినేత శ్రీకాంత్, అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్‌లు అభినందించినట్లు పేర్కొన్నారు.