
హెల్త్ పాలసీని వర్తింపజేయాలి
నగరంపాలెం: స్థానిక చుట్టుగుంట కూడలిలోని టుబాకో బోర్డు రైతు భవన్‌లో ఆదివారం భారత పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల వలె హెల్త్ పాలసీ పొగాకు బోర్డులో ఉద్యోగ విరమణ పొందిన వారికి వర్తింపచేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తద్వారా విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్య ఖర్చులు పొందుతారని అన్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు వెంకటరావు, మరో ఎనిమిది మంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్మానించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అసోసియేషన్ అధ్యక్షులు బీఎన్.మిత్ర, సభ్యు లు, హాజరయ్యారు.
కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా పెదకాకాని మండలంలో 145.2 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా కాకుమాను మండలంలో 8.2 మి.మీ. పడింది. సగటున 51.8 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 125.6 మి.మీ., దుగ్గిరాల 98.8, మేడికొండూరు 94.4, గుంటూరు పశ్చిమ 74.2, ఫిరంగిపురం 73.2, గుంటూరు తూర్పు 70.2, తాడేపల్లి 43.4, తెనాలి 42.4, చేబ్రోలు 30, వట్టిచెరుకూరు 25.6, తాడికొండ 24.8, తుళ్లూరు 20.6, మంగళగిరి 17.2, ప్రత్తిపాడు 15.2, పెదనందిపాడు 12.4, పొన్నూరు మండలంలో 11.6 మి.మీ. చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 74.4 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 105.7 మి.మీ. నమోదైంది.

హెల్త్ పాలసీని వర్తింపజేయాలి