రెండో రోజు కురిసిన భారీ వర్షం నీట మునిగిన రహదారులు నగర జీవనానికి ఆటంకం పలుచోట్ల ఇళ్లలోకి చేరిన నీరు పలుచోట్ల అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు మునక
నెహ్రూనగర్: గుంటూరు నగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నుంచి తెరుచుకోనేలోపు ఆదివారం కూడా కుంభవృష్టి కురిసింది. మధ్యాహ్నం 3.30గంటల నుంచి సుమారు మూడు గంటల పాటు వర్షం ఆగకుండా కురిసింది. నగరంలోని మెజార్టీ ప్రాంతాలు నీటమునిగిపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లాయి. వీధుల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర ప్రజలు అవస్థలు పడ్డారు.
కాలువలను తలపించిన వీధులు
నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ కాలువలను తలపించాయి. డ్రెయిన్లు, రోడ్లు ఏకమయ్యాయి. ముఖ్యంగా ముత్యాలరెడ్డినగర్, ఏటీ అగ్రహారం, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్, బొంగరాలబీడు, నగరంపాలెం, విద్యానగర్, మూడు వంతెనలు, కంకరగుంట అండర్‌పాస్, ఓల్డ్ క్లబ్ రోడ్డు, నగరపాలక సంస్థ కార్యాలయం పరిసర ప్రాంతాలు, కేవీపీ కాలనీ, కొత్తపేట, బృందావన్ గార్డెన్స్, కోబాల్డ్‌పేట, మల్లికార్జునరావుపేట, శ్రీనగర్, చుట్టుగుంట, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లాయి. వీధుల్లో భారీ ఎత్తున ప్రవాహంలా వర్షపు నీరు పారింది. వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. నీటిలో మునిగి వాహనాలు మొరాయించాయి.
నీట మునిగిన ఇళ్లు
భారీ వర్షానికి నగరంలోని ముత్యాలరెడ్డి, మురికిపేట, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల డ్రెయిన్లు మెరకలో ఉన్నాయి. రోడ్డు పల్లంగా ఉండటంతో వర్షం పడిన ప్రతి సారి ఇదే విధంగా నీట మునిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వ్యర్థాలు అడ్డం పడి పూడిపోయాయి.
మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ వృథా
వర్షాకాలంలో అవస్థల దృష్టా రూ. 4 కోట్లతో వేసవిలో మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టినా ఫలితం లేదు. డ్రెయిన్లలో పూడిక పనులను తూతూమంత్రంగా చేయడంతో వర్షం వస్తే గుంటూరు నగరంలో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. చిన్న వర్షం కురిసినా జన జీవనం స్తంభించిపోతోంది. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి డ్రైయిన్లను సక్రమంగా నిర్వహించడంతో పాటు లేనిచోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నగరంలోని పలు సెంటర్లలో మునిగిన దుకాణాలు
చిగురుటాకులా వణికిన గుంటూరు నగరం
చిగురుటాకులా వణికిన గుంటూరు నగరం
చిగురుటాకులా వణికిన గుంటూరు నగరం
చిగురుటాకులా వణికిన గుంటూరు నగరం
చిగురుటాకులా వణికిన గుంటూరు నగరం