YS Jagan: తొలి విడత మెడికల్ కాలేజీలు ప్రారంభించి నేటికి రెండేళ్లు | YS Jagan: two years since the first phase of medical colleges In AP | Sakshi
Sakshi News home page

YS Jagan: తొలి విడత మెడికల్ కాలేజీలు ప్రారంభించి నేటికి రెండేళ్లు

Sep 15 2025 3:49 PM | Updated on Sep 15 2025 4:52 PM

YS Jagan: two years since the first phase of medical colleges In AP

2023లో విజయనగరం మెడికల్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో వైఎస్‌ జగన్‌

తాడేపల్లి :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తవుతుంది. 2023లో విజయనగరంలో మెడికల్‌ కాలేజీని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.  అక్కడ నుంచే వర్చువల్‌గా రాజమహేంద్రవరం, ఏలూర, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను కూడా వైఎస్‌ జగన్‌ ఆరంభించారు. 

ఒకేసారి ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి రెండేళ్లు అవ్వడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు  కార్యాలయ ఇంచార్జ్‌ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని, జక్కంపూడి రాజా, పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలు హాజరయ్యారు.  

కాగా, ఏపీలో మెడికల్‌ కాలేజీలు అమ్మకానికి చంద్రబాబు కేబినెట్‌ ఇటీవల  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  రాష్ట్రంలోని పలు మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.

గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

 2023లో విజయనగరం మెడికల్‌  కాలేజీని వైఎస్‌ జగన్‌  ప్రారంభిస్తున్న దృశ్యం

వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. 


నాటి శంకుస్థాపన శిలాఫలకం

 

5 మెడికల్ కాలేజీలకు 2 ఏళ్లు పూర్తి YSRCP నేతల కేక్ కట్టింగ్ సంబరాలు

నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్‌ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement