
జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యం
గుంటూరు జీజీహెచ్‌లో ఆర్థోపెడిక్ సమస్యలకు రోజూ ఓపీ విభాగంలో ఉచిత సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి క్యాజువాలిటీలో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండి, ఎమర్జన్సీ ఓటీలో ఆపరేషన్లు చేస్తున్నారు. రోజూ 300 మంది ఓపీ విభాగంలో వైద్య సేవలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఆధునిక వసతులు సాధారణ, ఎమర్జెన్సీ ఆపరేషన్లు పదికిపైగా నిత్యం చేస్తున్నారు.
– డాక్టర్ యశస్వి రమణ,
సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, సూపరింటెండెంట్
●