
క్షతగాత్రులను నరసరావుపేట తరలింపు
నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆదివారం తీవ్రంగా గాయపడ్డవారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చస్సనిమ్మకాడి గ్రామానికి చెందిన దండ బడత్య(48), దుగాన్ గ్రామానికి చెందిన ముస్సా జనా(43)లు మృతి చెందారు. శివరాం గౌడ్, ఆలోక్ నాయక్, సుధీర్ దులైలకు తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా సుభాష్‌మాలిక్, దుబానాయక్, శాంతా నాయక్, ఎస్.వెంకయ్య, పవిత్ర బెహ్రలకు స్వల్పగాయాలయ్యాయి. ఏరియా వైద్యశాల్లో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పల్నాడు రోడ్డులోని జీబీఆర్ ప్రైవేటు వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నరసరావుపేట ఆర్డీఓ మధులత, బల్లికురవ, నరసరావుపేట తహసీల్దార్‌లు రవినాయక్, వేణుగోపాల్, సంతమాగులూరు సీఐ వెంకట్రావు మృతదేహాలను సందర్శించారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం తీరును కలెక్టర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని కలెక్టర్ కోరారు.

క్షతగాత్రులను నరసరావుపేట తరలింపు

క్షతగాత్రులను నరసరావుపేట తరలింపు