చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Aug 1 2025 11:40 AM | Updated on Aug 1 2025 11:40 AM

చేనేత

చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా

చీరాల: అధికారికంగా జులై 31ను చేనేత దినోత్సవంగా ప్రకటించాలని జాతీయ చేనేత నాయకులు, చేనేత ఉద్యమకారులు మాచర్ల మోహనరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని జాండ్రపేటలోని శ్రీచౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపంలో గురువారం చేనేత సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తీవ్ర మార్కెట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జీఎస్టీని వచ్చే సెప్టెంబర్‌ నుంచి 12 శాతానికి పెంచుతున్నట్లు ్ట కౌన్సిల్‌ ప్రకటించడం దారుణం అన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కనీసం రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించడంతోపాటు కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాంగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై ఉన్న జీఎస్టీ రద్దు చేయకపోవడం వలన చేనేతకు మూలాధారమైన నూలు ధరలు అసాధారణంగా పెరగడంతో ఉత్పత్తి మందగించి, కార్మికుల పనిదినాలు తగ్గిపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. అనంతరం దేశాయిపేట నుంచి జాండ్రపేట వరకు రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని, చేనేత వృత్తి భద్రత కల్పించాలని, చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, సీపీఐ నాయకులు బత్తుల శామ్యూల్‌, బిసి ఫెడరేషన్‌ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ చుండూరు వాసు, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్‌, దేవన హేమసుందరరావు, గుంటూరు మల్లికార్జున్‌, సజ్జా శ్రీనివాసరావు, వావిలాల దాశరధి, మునగాల వెంకటేశ్వర్లు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్‌ సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్ధన్‌, బాపట్ల జిల్లా రేపల్లె ఏడో వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్ధన్‌ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.

చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా1
1/1

చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement