వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం

Jul 28 2025 8:17 AM | Updated on Jul 28 2025 8:17 AM

వినియ

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం

తాడేపల్లి రూరల్‌ : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్‌ ప్లాజాలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు కూడారి తిరుపాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుడి ఇబ్బందులు, సమస్యలకు పరిష్కారం, హక్కులపై ఫోరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో కూడా వినియోగదారులు జరిగిన నష్టంపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షులు బొమ్ము జస్వంత్‌రెడ్డి, జిల్లా యూత్‌ విభాగం అధ్యక్షులు టి. రవికుమార్‌, ఫోరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలు ప్రియారెడ్డి, యూత్‌ జిల్లా ఇన్‌చార్జి షేక్‌ రిజ్వాన్‌, యూత్‌ వింగ్‌ ప్రతినిధి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

యోగాలో లిమిట్‌లెస్‌ సెంటర్‌ విద్యార్థులకు పతకాలు

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్‌జీఓ కాలనీలోని సుమేధా స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించారని యోగా టీచర్‌ వంగా వెంకటేష్‌ తెలిపారు. 10–14 వయస్సు విభాగంలో గోహితకు కాంస్యం, 18–28 విభాగంలో పి.భార్గవికి బంగారు, కాంస్యం, 28–35 విభాగంలో వి.వెంకటేష్‌కు రెండు బంగారు, 35–45 విభాగంలో రేణుక రెండు బంగారు పతకాలు సాధించారన్నారు. నిత్యం యోగాసనాలతోపాటు ఆహార అలవాట్లు మార్పు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతమని వెంకటేష్‌ తెలిపారు. విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారికి లిమిటెస్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ అధినేత నీలిమ అభినందనలు తెలిపారు.

వైభవంగా గిరిజా కల్యాణం

నగరంపాలెం: స్థానిక ఆర్‌.అగ్రహారం శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. వామనాశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గిరిజా కల్యాణం నిర్వహించడం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. త్వరగా పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో త్వరగా పెళ్లిళ్లు కావాలని ఆశీర్వదించారు. గిరిజా కల్యాణాన్ని వేద పండితులు (కాళహస్తి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 200 మంది యువతీ, యువకులను తీర్థప్రసాదాలు అందించారు. కార్య క్రమంలో తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్‌ఎస్‌ఆర్‌.ఆంజనేయులు, గుడివాడ రవీంద్ర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్‌ నిడమానూరు సురేష్‌, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు.

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం 
1
1/2

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం 
2
2/2

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement