
గుంటూరు
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
సజావుగా నీట్
7
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.90 అడుగుల వద్ద ఉంది. ఇది 138.3868 టీఎంసీలకు సమానం.
ఆకట్టుకున్న నృత్యప్రదర్శన
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాట్య గురువులను సత్కరించారు.
బల్లలు బహూకరణ
పెదకాకాని: పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి తక్కెళ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, అరుణకుమారి దంపతులు స్టీల్ బల్లలు బహూకరించారు.
● 97.71 శాతం హాజరు నమోదు
● పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) ఆదివారం పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా జరిగింది. గుంటూరు, తెనాలిలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల పరిధిలో 97.71 శాతం హాజరు నమోదైంది. నీట్‌కు దరఖాస్తు చేసిన 4,250 మంది విద్యార్థుల్లో 4,153 మంది హాజరయ్యారు. విద్యార్థులను విస్తృత రీతిలో తనిఖీ చేసిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష సజావుగా జరిగింది. విద్యార్థులను వెంట పెట్టుకుని తల్లిదండ్రులు ఉదయం 10 గంటల నుంచే కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై విధించిన ఆంక్షలతో పరీక్ష కేంద్రానికి చేరుకునే ముందుగానే విద్యార్థులు సంబంధిత వస్తువులను ఇంటి వద్దే తీసి వేసి వచ్చారు. నీట్ పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షణలో ప్రతి కేంద్రం పరిధిలో పరిశీలకులుగా నియమించిన తహసీల్దార్‌తో పాటు ఎన్‌టీఏ నుంచి నియమించిన మరొక పరిశీలకులు ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌ను సమన్వయం చేసుకుని పరీక్షను నిర్వహించారు.
న్యూస్‌రీల్

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు