
స్వామీజీని కలసిన ఎమ్మెల్యే కిలారు రోశయ్య
పెదకాకాని: సృష్టిలో సర్వ జగత్తు దైవాధీనంలోనే ఉంటుందని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. స్థానిక శివాలయంలో ప్రారంభమైన పుష్కర అష్టబంధన మహా కుంభాభిషేకం క్రతువు శైవాగమశాస్రోక్త సాంప్రదాయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ ఈ జగత్తు మొత్తం దైవాధీనంలోనే ఉంటుందని, దేవతలు మంత్రాల ఆధీనంలో ఉంటారని, మంత్రాలు బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటాయన్నారు. బ్రాహ్మణోమమదేవతలూ అని శ్రీ కృష్ణపరమాత్మ చెప్పడం జరిగిందన్నా రు. పుష్కర అష్టబంధన మహా కుంభాభిషేకం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మహా కుంభాభిషే కం పీఠాధిపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. పూజా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం అష్టబంధనపూజ, సమర్పణ, 108 మంది దంపతులచే అష్టోత్తర శతకలశ స్నపన మండపార్చన సువాసినులే సామూహిక సౌభాగ్య కుంకుమార్చన శతరుద్రీయ జపాభిషేకాలు ద్వితీయ కాలహోమాలు, నీరాజనాలు నిర్వహించారు. ఆలయంలో ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనర్ నల్లకాల్వ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య సరస్వతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులను సందర్శించిన వారిలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయశాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ, ఉప కమిషనర్ ఈమని చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.
విశాఖ శారద పీఠాధిపతి
స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి
ఘనంగా మహా కుంభాభిషేకం
పూజల్లో ఎమ్మెల్యే కిలారి దంపతులు