ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు! | World's Shortest Married Couple Claim Guinness World Record | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు!

Published Thu, Jun 13 2024 12:00 PM | Last Updated on Thu, Jun 13 2024 12:11 PM

World's Shortest Married Couple Claim Guinness World Record

పెళ్లి అంటే ఈడు జోడు ఉండాలి, ఇరు సంప్రదాయాలు అన్ని కలవాలి అని చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడూ ఈ రోజుల్లో అదంతా కష్టంగా మారింది.కెరీర్‌ అంటూ.. ముప్పై, నలభైల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్థితికే ప్రాధాన్యత, మిగతా అంతా ఎలా ఉన్న పర్లేదు అన్నట్లుగా ఉంది వ్యవహారం. అలాంటి పరిస్థితుల్లో శారీరకపరంగా పొట్టిగా ఉన్న ఓ జంట మాత్రం తమలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తులు దొరికే వరకు నిరీక్షించి మరీ పెళ్లి చేసుకున్నారు. పైగా అదే వారిని విలక్షణమైన జంటగా రికార్డులకెక్కేలా చేసింది. 

వివరాల్లోకెళ్తే..బ్రెజిలియన్‌కి చెందిన పాలో గాబ్రియేల్‌ డా సిల్వా బారోస్‌, కటియుసియా లీ ఇద్దరూ ఆహార్యం పరంగా అత్యంత పొట్టి వ్యక్తులు. సమాజం నంచి ఎదురైనా అవహేళనలు, ఒత్తిళ్లకు తగ్గకుండా..తమలాంటి వ్యక్తులు కోసం అన్వేషించారు. వారి భౌతిక లక్షణాలను అంగీకరించి మరీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. వారి అన్వేషణ ఎట్టకేలకు ఫలించి 2006లో ఇరువురు కలుసుకోవడం జరిగింది. దాదాపు 15 ఏళ్లుగా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్‌ చేసుకుంటూ..వారి మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించుకున్నారు.

ఆ తర్వాత ఇరువురు వివాహ బంధంతో ఒక్కటి అవ్వాలని భావించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రపంచంలోని అత్యంత పొట్టి వివాహిత జంటగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. జీవతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాం. తామిరువురం ఎదురపడతామనే ఊహించలేదు. అలాగే మా బంధాన్ని కొనసాగించగలమా? లేదా ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ఇరువరి నిలబడగలుగుతామా అని నిర్ణయించుకుని, ఒకరిపై ఒకరికి అవగాహన ఏర్పడ్డాక తాము వివాహ బంధంలోకి అగుడుపెట్టాం అని చెబుతోంది ఆ జంట. 

అంతేగాదు తాము చూసేందుకు చిన్నగా ఉన్నా తమ ఇద్ది\రి మనసులు చాలా విశాలమని, జీవితం విసిరే ప్రతి సవాలుని ఎదుర్కొని సంతోషంగా జీవించగలమని నమ్మకంగా చెబుతున్నారు. కాగా, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సు ప్రకారం..ఈ జంట ఉమ్మడి ఎత్తు 181.41 సెం.మీ (71.42 అంగుళాలు). పాలో ఎత్తు 90.28 cm (35.54 in) అయితే కటియుసియా ఎత్తు 91.13 సెం.మీ(35.88 అంగుళాలు). ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామం వేదికగా వెల్లడించింది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సు. అంతేగాదు నెజన్టు కూడా ది బెస్ట్‌ కపుల్‌, ఈ జంట సూపర్‌ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement