Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు!

Winter Care Health: Cold Weather Muscle Cramp Relief Tips By Expert - Sakshi

Winter Care- Health Tips: చాలామందికి నిద్ర నుంచి లేవగానే నరాలు పట్టేస్తాయి. అవి రిలీఫ్ అయ్యేంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. నరాలు, మెడ, పాదాలు, నడుమునొప్పికి పరిష్కారం ఏముంది? అన్నింటికంటే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మానసికంగా కృంగి పోయినప్పుడు కూడా మెడ నరాలు పట్టేస్తాయి. మానసిక రోగాలు శారీరక రోగాలుగా మారతాయి. అందువల్ల మానసిక అరోగ్యం సాధించండి.

ఒక్కోసారి కనిపించే లక్షణాలు
1. కాళ్ళు చేతులు మన ఆధీనములో ఉండవు, చలికి వణికినట్టు కంపిస్తాయి.
2. మెడ నరాలు పట్టినప్పుడు మెడకింద తవ్వ పెట్టుకుని, నేల మీద పడుకుంటే, విశ్రాంతిగా ఉంటుంది. చాలా వరకు ఉపశమనం కలుగుతుంది.
3. కీళ్ల నొప్పి ఎక్కువ ఉంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.

4. ఆవ నూనె, లేదా యూకలిప్టస్ నూనె వ్రాయండి. తరువాత ,కాపడం పెట్టుకోవాలి.
5. వీలయితే తలను గుండ్రంగా తిప్పండి. కూడా నుండి, ఎడమకు, ఎడమ నుండి కుడికి .
6. సమయానికి భోజనము, విశ్రాంతి, సరైన వేళలలో నిద్ర పోవడము అలవరచుకోవాలి
7. మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి

మోకాలు, కీళ్ల నొప్పుల నివారణకు కోసం
ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారికి స‌హ‌జంగానే ఎప్ప‌టికప్పుడు నొప్పులు వ‌స్తుంటాయి. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే తగ్గడానికి ప్రయత్నించాలి

►అలొవెరా (క‌ల‌బంద‌)ను అనేక ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అలొవెరాలో యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఆర్థ‌రైటిస్ నొప్పులు త‌గ్గుతాయి. ఇందుకు గాను కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని నేరుగా సంబంధిత ప్రదేశంలో రాయాలి. 

►శ‌ల్ల‌కి అనే వృక్షానికి చెందిన జిగురుతో కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇందులోనూ యాంటీ ఇన్ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. దీన్ని తెలుగులో ధూప‌ము, గుగ్గిల వృక్షం అని పిలుస్తారు. దీని జిగురును నిత్యం 1 గ్రాము మోతాదులో తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌ల్ల‌కి మ‌న‌కు మార్కెట్‌లో ట్యాబ్లెట్లు, క్రీముల రూపంలోనూ ల‌భిస్తుంది.

►నీల‌గిరి ఆకుల తైలాన్ని 15 చుక్క‌ల మోతాదులో తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్ల బాదం నూనె నొప్పిగా ఉన్న దగ్గర మాలిష్ చేయాలి కొంత వరకు రిలీఫ్ అవుతుంది 
-డా. నవీన్‌ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

చదవండి: Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్‌ తినడం వల్ల..
Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్‌, షుగర్‌ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా..

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top