ఈ బెల్ట్‌ వేస్తే బెల్లీ ఫ్యాట్‌ మాయం! | These Fitness Belt Reduce Belly Fat | Sakshi
Sakshi News home page

ఈ బెల్ట్‌తో పొట్ట చుట్టూ కొవ్వు ఈజీగా కరుగుతుందట

Feb 21 2021 10:11 AM | Updated on Feb 21 2021 10:11 AM

These Fitness Belt Reduce Belly Fat - Sakshi

ఫిట్‌నెస్‌ బెల్ట్‌ కొవ్వు ఉన్న శరీరభాగాలకు చుట్టుకుంటే.. అధిక ఫ్రీక్వెన్సీ మసాజ్‌ వైబ్రేషన్‌తో, తేలికపాటి హీట్‌తో.. కొవ్వును సమర్థవంతంగా తగ్గిస్తుంది.

‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అనేది పాత సామెత. ‘చిక్కినమ్మే చక్కనమ్మ’ ఇది లేటెస్ట్‌ ట్రెండ్‌. నిజానికి ఎవరైనా సరే.. సన్నగా, సరైన కొలతలతో ఉంటే.. మిగతాదంతా మేకప్‌తో, క్రేజీ డ్రెస్‌లతో కవర్‌ చేసేసుకోవచ్చు. అందుకే లావుగా, బొద్దుగా కనిపించే కంటే.. స్లిమ్‌గా, జీరో సైజ్‌ మెయిన్‌టైన్‌ చెయ్యడానికే ఇష్టపడుతుంటారు అమ్మాయిలు. అలాంటి వారి కోసమే ఈ స్లిమ్మింగ్‌ బెల్ట్‌. ఇది ఆకర్షణీయమైన ఆకృతిని అందిస్తుంది. ఈ ఫిట్‌నెస్‌ బెల్ట్‌ కొవ్వు ఉన్న శరీరభాగాలకు చుట్టుకుంటే.. అధిక ఫ్రీక్వెన్సీ మసాజ్‌ వైబ్రేషన్‌తో, తేలికపాటి హీట్‌తో.. కొవ్వును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా పొట్ట, నడుము భాగాల్లో కొవ్వుని పూర్తిగా కరిగిస్తుంది. లేటెస్ట్‌ ఎలిప్టికల్‌ స్వింగింగ్‌ మసాజ్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రొడక్ట్‌.. బరువు తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. శారీరక వ్యాయామంలానే.. భుజం, తొడలు, వీపు భాగం, చేతులు ఇలా కొవ్వు పేరుకున్న ప్రదేశాల్లో ఈ బెల్ట్‌ను చుట్టుకుని రోజుకు పది నిమిషాలు ఉంచితే చాలు.

బెల్ట్‌ ముందు భాగంలో రెడ్, గ్రీన్‌ బటన్స్‌ ఉంటాయి. బెల్ట్‌ని బాడీకి కావాల్సిన విధంగా అడ్జెస్ట్‌ చేసుకునే వీలుంటుంది. దీనికి కనెక్ట్‌ చేసుకునేందుకు హైక్వాలిటీ రిమోట్‌ ఉంటుంది. దానిలో ఆన్‌/ఆఫ్‌ బటన్‌తో పాటు టైమర్‌ బటన్, ఆటో 1,2,3 అనే మోడ్స్, మాన్యువల్‌ బటన్‌ వేర్వేరుగా ఉంటాయి. 5 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు అని నాలుగు టైమింగ్‌ బటన్స్‌ ఉంటాయి. ఫంక్షన్, స్ట్రాంగ్, వీక్‌ అనే ఆప్షన్స్‌ ఉంటాయి. ఈ బెల్ట్‌కి ప్రత్యేకమైన చార్జర్‌ లభిస్తుంది. ఈ న్యూ టెక్నాలజీ బెల్ట్‌ ధర 52 డాలర్లు. అంటే 3,787 రూపాయలు. ఇలాంటి మోడల్స్‌ అదనపు సౌకర్యాలతో మార్కెట్‌లో చాలానే అమ్ముడుపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement