
అబద్దం..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్దాలు చెబుతూనే ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా అవసరం కొద్దీ కొన్నిసార్లు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్దాలు చెబితే, మరికొందరు ప్రతి చిన్న విషయానికి కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు.
వీళ్లలో మగవాళ్లే, ఆడవాళ్ల కంటే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.మహిళలు రెండింతలు అబద్దాలు చేపితే పురుషులు వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు పరిశోధకులు తేల్చేశారు. మన దేశంలో ఎక్కువగా ఎవరు ఏఏ సందర్భాల్లో అబద్దాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
►ఎక్కువగా జీవిత భాగస్వామితో అబద్దాలు చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళలతో షాపింగ్ చేసేందుకు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటారని తేలింది.
► సారీ.. పనిలో ఉన్నాను,ఫోన్ చూసుకోలేదు. అందుకే లిఫ్ట్ చేయలేదు అని ఎక్కువగా అబద్దాలు చెబుతుంటారు.
► నువ్వే నా ఫస్ట్ లవ్ అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. చాలామంది మగవాళ్లు ఈ అబద్దాన్ని తమ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా ఈ అబద్దం చెబుతారట.
► కొంతమంది మగవాళ్లు రేపట్నుంచి సిగరెట్ మానేస్తాను అని చెప్పి ప్రతిరోజు అదే రిపీట్ చేస్తారట.
► ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్దామని అడిగితే, ఇష్టం లేకపోతే పని ఉందని అబద్దం చెబుతారట.
► చాలామంది తమ దగ్గర చేతులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టపడరట. అప్పు అడిగితే ఇప్పుడు లేవు అని అబద్దాలు చెబుతున్నారట.
► కొంతమంది నోరు తెరిస్తే అబద్దాలు చెబుతుంటారు. అలా దొరికిపోతారు కూడా..అయినా సరే, ఇప్పుట్నుంచి అబద్దాలు చెప్పను అని మళ్లీమళ్లీ చెబుతుంటారు.
► అనుకున్నా టైం కంటే ఆలస్యమైతే, సారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను అని ఈజీగా అబద్దాలు ఆడేస్తారట.
► ఆడవాళ్లలో చాలామందికి పొసెసివ్ ఫీలింగ్ ఎక్కువ. తమకు అటెష్టన్ ఉండాలని ఆరాటపడతారట.వేరే అమ్మాయిలు అందంగా రెడీ అయినా జస్ట్ ఓకే, పర్లేదు, ఈ డ్రెస్ నీకంత నప్పలేదు అని అబద్దాలు చెబుతారట.
► నా బైక్ పంక్చర్ అయ్యింది, లేదా పెట్రోల్ అయిపోయింది అని చెబుతుంటారట ఒకవేళ బైక్ ఇవ్వడం ఇష్టం లేకపోతే
► అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ఫీట్లు చేసి అబద్దాలు చెబుతుంటారట.
ఇందులో 58% మంది తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అబద్దాలు చెబుతారని, 42% మంది తమ సీక్రెట్‌ను రహస్యంగా ఉంచేందుకు అబద్దాలు చెబుతారని తేలింది. 40శాతం మంది తాము నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని పరిశోధనలో వెల్లడైంది. మొత్తంగా చూసుకున్నా ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా అబద్ధం చెప్పే వారి సంఖ్య మగవారిలోనే అధికంగా ఉంటుందట.కొందరి బాడీ లాంగ్వేజీని బట్టి కూడా అబద్దాలు చెబుతున్నారా లేదో తెలుసుకోవచ్చట. మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభమవుందని చెబుతున్నారు నిపుణులు.