వాచ్‌మెన్‌గా ఉంటూనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు పట్టేశాడు! | Telangana Praveen Got 3 Jobs Details Here Goes Viral | Sakshi
Sakshi News home page

వాచ్‌మెన్‌గా ఉంటూనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు పట్టేశాడు!

Published Fri, Mar 1 2024 4:52 PM | Last Updated on Fri, Mar 1 2024 5:45 PM

Telangana Praveen Got 3 Jobs Details Here Goes Viral - Sakshi

మనం ఎక్కడినుంచి వచ్చాం.. మన బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి అన్నది కాదు.. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా లేదా అన్నదే  ముఖ్యం.  ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వాచ్‌మెన్‌గా పనిచేస్తూనే లక్ష్యం వైపు గురి పెట్టాడు. పేదరికం ప్రతిభకు ఆటంకం కాదని నిరూపించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన గొల్లె ప్రవీణ్. 

ప్రభుత్వ ఉద్యోగమనే కలను నెరవేర్చుకోవడం, మరో వైపు కుటుంబానికి భారం కాకుండా స్వయం ఉపాధి పొందడం ఇదే ప్రవీణ్‌ కళ్ల ముందున్న  లక్ష్యాలు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్‌ మల్టీమీడియా రిసెర్చ్‌ సెంటర్‌ (ఈఎంఆర్‌సీ)లో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. రాత్రి సమయంలో వాచ్‌మేన్‌గా పని చేస్తూ పగలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు. ఎట్టకేలకు అతని కష్టం ఫలించింది. కేవలం పదిరోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. 

ప్రవీణ్ టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్‌ ఉద్యోగాలను సాధించాడు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తనలాంటి ఎందోమంది కొత్త ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. కాగా ప్రవీణ్ తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తుండగా ప్రవీణ్ తండ్రి పెద్దులు  రోజుకూలీగా పనిచేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement