
రాహుల్ ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆర్నెలలుగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవుతున్నాడు. పేరెంట్స్‌పై అరుస్తున్నాడు. చదువుపై శ్రద్ధ తగ్గింది. అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు. అదేమని అడిగితే గొడవపడుతున్నాడు.
టీనేజ్‌లో ఇలాంటి మూడ్ స్వింగ్స్, కోపతాపాలు, తిరుగుబాట్లు సహజం. కాని, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో చాలామంది పేరెంట్స్ కు తెలియదు. అందుకే రాహుల్ పేరెంట్స్ అతన్ని కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు. రెండు వారాల్లో కోపతాపాలు తగ్గాయి. మూడో వారానికి స్క్రీన్ టైమ్ సెట్ అయ్యింది. నాలుగో వారానికి తనకు ఎంత బ్రేక్ టైమ్ కావాలో చెప్పడం ప్రారంభించాడు.
ఎందుకిలా ప్రవర్తిస్తారు?
టీనేజర్ల తిరుగుబాటు, మూడ్ స్వింగ్స్ ఆ వయసులో వచ్చే ఒక మార్పు. అంతే తప్ప మీ పిల్లలు చెడ్డవారని కాదు. అందుకు కారణాలు తెలుసుకుంటే వారి ప్రవర్తన మీకు అర్థమవుతుంది.
మెదడులో ఎమోషన్ సెంటరైన లింబిక్ సిస్టమ్ టీనేజ్‌లో త్వరగా యాక్టివ్ అవుతుంది. కాని, కంట్రోల్ సెంటరైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ 20 ఏళ్ల తర్వాత పరిపక్వతకు చేరుతుంది. అందుకే ముందు ఎమోషన్, తర్వాత ఆలోచన.
టీనేజ్‌లో కొత్తదనం, థ్రిల్, తక్షణ రివార్డులకు మెదడు సులభంగా ఆకర్షితమవుతుంది.
డోపమైన్,సెన్సేషన్ సీకింగ్ ఉంటుంది. అందుకే టీనేజ్‌లో అన్ని మూడ్ స్వింగ్స్.
టీనేజ్‌లో మెలటోనిన్ ఆలస్యంగా విడుదలవడం వల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర, ఉదయం ఆలస్యంగా లేవడం సహజం. నిద్ర తక్కువ కావడం వల్ల చిరాకు ఉంటుంది.
సొంత అస్తిత్వం కోసం వెతుకులాట మొదలవుతుంది. ‘నేనెవరు?’ అనే అన్వేషణ, ‘నా మాట వినండి’ అనే అవసరం ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే పేరెంట్స్‌పై తిరుగుబాటు.
ఇక ఇతరులతో పోలిక, ఏదో కోల్పోతున్నాననే భావన భావోద్వేగాలను పక్కకు నెట్టేస్తాయి.
ఎప్పుడు జాగ్రత్త పడాలి?
చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవ్వడం, కేకలు, తలుపులు బిగించడం.
ఏ కారణం లేకుండానే విపరీతమైన మూడ్ స్వింగ్
తన భావాలను సమర్థించుకునేందుకు మౌనంగా ఉండటం
స్కూల్‌ను అవాయిడ్ చేయడం, నిద్ర, ఆహారంలో తీవ్ర మార్పులు.
‘సేఫ్ కాదు’ అనిపించినప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా బిగుసుకుపోవడం
దీర్ఘకాల దుఃఖం, స్వీయనింద, పేరెంట్స్‌కు దూరంగా ఉండటం
ఇలాంటప్పుడు ఆలస్యం చేయకండి. వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. ఎమోషనల్ మెడిసిన్‌గా కౌన్సెలింగ్ త్వరగా పనిచేస్తుంది.
B.R.I.D.G.E. ఫ్రేమ్‌వర్క్
టీనేజర్ల భావాలు ‘సమస్య’ కాదు, సిగ్నల్స్. వాటిని అర్థం చేసుకుని స్పష్టమైన బౌండరీలు పెడితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకు ఈ రోజు నుంచే B.R.I.D.G.E.., RESET మొదలు పెట్టండి.
Breathe & Body Co®ulation: టీనేజర్లను టీజ్ చేయకండి, తర్కం చేయకండి. 20 శాతం గొంతు తగ్గించండి.
Reflect the Feeling: ‘నీకు ఇప్పుడు ఒత్తిడి,కోపం మిక్స్‌డ్‌గా ఉన్నట్టుంది’ అని గుర్తించండి. వారి భావోద్వేగాలను మీరు గుర్తించడం వాటి తీవ్రతను తగ్గిస్తుంది.
Invite Choice:: ‘ఇలా చేయాలి’ అని చెప్పకుండా, రెండు ఆప్షన్లు ఇవ్వండి. అందులో ఒకటి ఎంచుకుంటారు.
Define Boundary: ‘కేకలు, వస్తువులు విసరాల్సిన అవసరంలేదు. నీకు అలసటగా ఉంటే కాసేపు బ్రేక్ తీసుకుందాం’ అని చెప్పండి.
Guide with Skills:: భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన టెక్నిక్స్ నేర్పించండి.
Engage & Repair: కోపతాపాలు తగ్గాక, ‘ఇప్పుడు శాంతంగా ఉన్నాం. అసలేం జరిగింది? నెక్స్‌ట్ టైమ్ ఏం చేస్తే బాగుంటుంది?’ అని మాట్లాడండి.
ఐదునిమిషాల్లో ‘రీసెట్’
Regulate:: శ్వాసను నియంత్రించుకోండి. నాలుగు సెకండ్లు ఉచ్ఛ్వాస, రెండు సెకన్లు బంధనం, ఆరు సెకండ్లు నిశ్వాస
Empathize: ‘నీ మాటలు వినకపోవడమే నీ కోపానికి కారణమా?’
Set Limit: ‘చర్చ ఓకే, అవమానం, విసరడం ఓకే కాదు.’
Explore Trigger: ‘ఇవాళ స్కూల్లో ఏదైనా జరిగిందా?’
Each Tiny Tool: 3 పాయింట్స్ రూల్–‘నీకు ముఖ్యమైన మూడు పాయింట్లు చెప్పు; తరువాత నా మూడు.’