
‘పచ్చబొట్టు చెరిగిపోదులే’ అన్న పాట ఈరోజుల్లో చెల్లదు. ఏదో ఒక ఎమోషన్‌లో, ఏదో ఒక మూమెంట్‌లో ఇష్టపడి వేయించుకున్న పచ్చబొట్టు– కష్టమైనా ఉంచుకోక తప్పని రోజులు పోయాయి.
టాటూలను శాశ్వతంగా తొలగించడానికి లేజర్ టాటూ రిమూవల్ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో, అధిక తీవ్రత కలిగిన లేజర్ కిరణాలు చర్మంపై ఉన్న టాటూ ఇంక్‌ను చిన్న చిన్న కణాలుగా విడగొడతాయి. ఈ చిన్న కణాలను శరీరం తన సహజ ప్రక్రియతో తొలగిస్తుంది. లేజర్ చికిత్సకు సాధారణంగా అనేక సెషన్లు అవసరం అవుతాయి.
టాటూ పరిమాణం, ఇంక్ రంగు, టాటూ వేయించుకున్న కాలం, చర్మపు తీరును బట్టి సెషన్ల సంఖ్య మారుతుంది. కొన్నిసార్లు వాపు రావడం, చర్మం కందిపోవడం, బొబ్బలు రావడం వంటి సమస్యలు తలెత్తినా పచ్చబొట్టు మచ్చ పోగొట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్. చర్మవ్యాధి నిపుణుల పర్యవేక్షణలో ఈ చికిత్స చేయించుకోవడం ఉత్తమం.