
'ఉపవాసం' ఆరోగ్యానికి చాలా మంచిదని భావించేవాళ్లం. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటే అధిక కొలస్ట్రాల్ కరిగి, క్యాలరీలు ఖర్చు అవ్వుతాయని చెప్పేవారు. దీనివల్ల ఆరోగ్యం మెరగవుతుందని అనేవారు నిపుణులు. ఈ 'ఉపవాసం' అనేది శరీరంలోని శక్తిని బర్న్ చేసే ఒకలాంటి వ్యాయామమేనని పదేపదే చెప్పేవారు వైద్యులు. అయితే అదంతా సరైనది కాదని వాదిస్తున్నారు యూఎస్ శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో చాలా ఆసక్తికర షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే..
అధిక బరువు సమస్యకు ఉపవాసం అనేది ఒక మంచి ఔషధం లాంటిదనేవారు. భోజన సమయాన్ని ఎనిమిది గంటలకు పరిమితి చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. అంతేగాదు గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 91% పెరుగుతుందన్నారు. చికాగోలోని అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ ఈ తాజా పరిశోధనను ప్రచురించింది. ఉపవాసాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే బరువు అదుపులో ఉంటుందని, ఇలా చాలమంది బరువు తగ్గిన దాఖాలాలు కూడా ఉన్నాయని నిరూపితమైన అధ్యయనాల ఫలితాల సంగతేమిటని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
అయితే చికాగో శాస్త్రవేత్తల బృందం యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెందిన నెషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ దాదాపు 20 వేల మంది పెద్దలపై పరిశోధనలు నిర్వహించింది. దాదాపు 12 నుంచి 16 గంటల వరకు అప్పడప్పుడూ ఆహారాన్ని తీసుకోని వారు, తీసుకున్న వారు మద్య ఉన్న వ్యత్యాసాన్ని స్టడీ చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా సగటు వయసు 48 ఏళ్లు. ఇక అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తున్న వారిలో మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రభావం తక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే నిర్ణిత సమయంలో ఆహారం తీసుకునే వారితో పోల్చగా..కొన్ని గంట సమయానికి ఆహారాన్ని పరిమితం చేసిన వారిలో పలు సమసయలు కనిపించాయన్నారు. వారిలో హృదయ నాళ సమస్యలు ఉత్ఫన్నమయ్యి చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు.
ఈ పరిశోధనను శాస్త్రవేత్తలు సుమారు 2003 నుంచి 20019 వరకు చేశారు. ఆయా కాలాల మధ్య చనిపోయిన బాధితుల మరణాల డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అనేదానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిఉందని యూకే ప్రోఫెసర్ కీత్ ఫ్రాయిన్ అభిప్రాయపడ్డారు. నిజానికి జీర్ణశయానికి ఒకరోజు విరామం ఇచ్చి.. ఈజీగా క్యాలెరీలను తగ్గించేందుకు ప్రసిద్ధ సాధనం ఈ "ఉపవాసం".
అలాంటిది ఆరోగ్యానికి హానికరం అనడం సరైనది కాకపోవచ్చిని అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేదానిపై మరిన్ని పరిశోధను చేయాల్సి ఉందన్నారు. అలాగే అడపాదడపాగా ఉపవాసం నిజంగా ఆయా వ్యక్తులు చేశారా, వారికి ఇంకేమైన అలవాట్లు ఉన్నాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు యూకే ఫ్రొఫెసర్.
(చదవండి: డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!)