
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మికమరణం యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.సింగపూర్‌లో శుక్రవారం జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ప్రాణాలు కోల్పోవడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి.
అయితే జుబీన్‌మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన విడుదల చేశారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లనే అతని చనిపోయినట్టు తెలిపారు. జుబీన్ గార్గ్‌ను లైఫ్‌గార్డులు లైఫ్ జాకెట్ ధరించమని కోరినా వినలేదని, ఈ విషయాన్ని జుబీన్ సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే తనకు చెప్పారని ముఖ్యమంత్రి ప్రకటించారు. యాచ్ సిబ్బంది , గార్డులు గార్గ్ దానిని ధరించాలని పట్టుబట్టారు. గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించాడు, కానీ కొన్ని సెకన్ల తర్వాత, దాని సైజ్ సరిపోకపోవడంతో అతనికి ఈత కొట్టడం కష్టంగా ఉందని పేర్కొంటూ దానిని తీసివేసాడట. దీంతో గార్గ్‌తో సహా 18 మంది స్కూబా డైవింగ్ వెళ్లారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. లైఫ్ జాకెట్ ధరించని జుబీన్‌మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించాడు. లైఫ్‌గార్డ్‌లు వెంటనే CPR ఇచ్చి, గార్గ్‌ను సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారని,అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. గాయకుడితో పాటు వచ్చిన వారిని సింగపూర్ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కహిలిపారా ప్రాంతంలోని గార్గ్ నివాసాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గార్గ్ భార్యకు, కుటుంబానికి సంతాపం తెలిపారు.
জুবিন গাৰ্গৰ অন্তিমটো ভিডিঅ’৷ #ZubeenGargNoMore pic.twitter.com/WMcUsLGWr1
— Jyoti Prasad Nath জ্যোতি প্ৰসাদ নাথ (@xitoo27) September 19, 2025
కన్నీరుమున్నీరుగా భార్య
సంగీత పరిశ్రమకు జుబీన్ అందించిన సేవలు, కృషి సాటిలేనిది. హిందీ, బెంగాలీ , అస్సామీ భాషలలో తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. జుబీన్ అభిమాని అయిన గరిమా 2002లో అతణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ప్రమాదంలో జరగకపోయి ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అకాల మరణం అభిమానుల హృదయాల్లో విషాదాన్ని మిగిల్చింది. జుబీన్ భార్య గరిమా సైకియా శోకం వర్ణనాతీతం. ఆయన పెంపుడుకుక్క కూడా విషణ్ణ వదనంతో కనిపించింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌మీడియాలో అభిమానులను మరింత విషాదంలోకి నెట్టేశాయి.