ఫిట్‌నెస్‌పై ఇంత క్రేజా?! | Rs More than 8 crore made in a single day Bengaluru Fitness Event | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌పై ఇంత క్రేజా?!

Apr 14 2026 6:05 PM | Updated on Apr 14 2026 7:12 PM

Rs More than 8 crore made in a single day Bengaluru Fitness Event

పట్టణాల్లో, నగరాల్లో మారథాన్‌, అధిక ఫోర్స్‌తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్‌. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్‌నెస్‌ సెంటర్‌ ఈవెంటే. 

ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్‌ ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్‌. అందుకు సంబంధించిన పోస్ట్‌ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్‌నెస్‌ ఈవెంట్‌లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్‌. మారథాన్‌లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్‌ చేస్తున్నారంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు కేడియా. 

ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్‌నెస్‌ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్‌నెస్‌ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్‌నెస్‌ ప్రియులు. 

 

(చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement