చిపి చిపీ చాపా... డుబిడుబిడు | Rise and reign of Chipi Chipi Chapa Chapa Dubidubidu | Sakshi
Sakshi News home page

చిపి చిపీ చాపా... డుబిడుబిడు

Mar 3 2024 12:41 AM | Updated on Mar 3 2024 12:41 AM

Rise and reign of Chipi Chipi Chapa Chapa Dubidubidu - Sakshi

వైరల్‌

వైరల్‌ ట్రెండ్‌ క్రియేట్‌ కావడానికి కొలతలు, ప్రమాణాలు అంటూ ఏవీ ఉండవు. తాజా వీడియో ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు తెస్తోంది. అర్థం తెలియని ఒక పదబంధం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దృష్టిని ఆకర్షించి వైరల్‌ ట్రెండ్‌గా మారింది. ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు’ అనే పదబంధాలను లయాత్మకంగా పలుకుతూ, ఆకట్టుకునే డ్యాన్స్‌ స్టెప్స్‌ వేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో వెల్తువెత్తుతున్నాయి.

 అసలు ఈ ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు అనే వింత సౌండ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయానికి వస్తే... జనవరిలో విడుదలైన ఒక  ఫిలిప్పినో పాటలోని సౌండ్స్‌ ఇవి. ట్రెండ్‌ను ఉన్నది ఉన్నట్లు ఫాలో  కాకుండా వివిధ రూపాల్లో తమదైన సృజనాత్మకతను జోడిస్తున్నారు క్రియేటర్స్‌. పవర్‌ఫుల్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ నుంచి నవ్వు తెప్పించే లిప్‌సింక్‌ వరకు... వారి సృజనాత్మకతకు హద్దులు లేవు. టిక్‌టాక్‌లో పుట్టిన ఈ ట్రెండ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించి ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement